అక్కినేని వారింట మరోసారి శుభవార్త రాబోతోందా అనే చర్చ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. కింగ్ నాగార్జున అక్కినేని (Nagarjuna Akkineni) తాత కాబోతున్నారన్న వార్తలు టాలీవుడ్ వర్గాల్లో వేగంగా వైరల్ అవుతున్నాయి. అయితే అసలు ప్రశ్న ఏంటంటే తండ్రి కాబోతున్నది నాగచైతన్య (Naga Chaitanya)నా లేక అఖిల్ అక్కినేని (Akhil Akkineni)నా అన్నదే. ఇటీవలే నాగచైతన్య–శోభిత ధూళిపాళ్ల (Sobhita Dhulipala), అఖిల్–జైనబ్ (Zainab) వివాహాలు జరగడంతో అక్కినేని ఫ్యామిలీపై అందరి దృష్టి పడింది.
మొదట్లో నాగచైతన్య తండ్రి కాబోతున్నాడని, శోభిత ప్రెగ్నెంట్ అని ప్రచారం జరిగింది. కానీ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే శోభిత నుంచి అలాంటి సంకేతాలు కనిపించకపోవడంతో ఆ వార్తల్లో నిజం లేదని తేలింది. దాంతో ఇప్పుడు చర్చ మొత్తం అఖిల్ అక్కినేని వైపు మళ్లింది. ఈ ఏడాది జూన్‌లో జైనబ్‌తో అఖిల్ వివాహం జరిగింది. వయస్సులో తేడా ఉన్నా ఇద్దరి మధ్య మంచి అర్థం కుదరడంతో కుటుంబాల అంగీకారంతో పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత నుంచి అక్కినేని కుటుంబం ఏదో ఒక వార్తతో మీడియాలో నిలుస్తూనే ఉంది.
ఈ నేపథ్యంలో నాగార్జున ఒక హెల్త్ ఈవెంట్‌లో పాల్గొన్న సమయంలో మీడియా ప్రశ్నలు ఎదురయ్యాయి. “మీరు త్వరలో తాత కాబోతున్నారని వార్తలు వస్తున్నాయి, నిజమేనా?” అని ఓ రిపోర్టర్ అడగగా, నాగార్జున నవ్వుతూ “సరైన సమయం వచ్చినప్పుడు నేనే అధికారికంగా చెప్తాను” అంటూ సమాధానం ఇచ్చారు. ఈ వ్యాఖ్యను ఆయన ఖండనగా చెప్పకపోవడంతో అభిమానుల్లో అనుమానాలు మరింత బలపడ్డాయి. ఇదే ఇప్పుడు అఖిల్ తండ్రి కాబోతున్నాడన్న ప్రచారానికి బలం చేకూరుస్తోంది.
ఇక అఖిల్ సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ఆయన లెనిన్ (Lenin Movie) అనే చిత్రంలో నటిస్తున్నారు. కెరీర్ మొదలై చాలా కాలమైనా సరైన కమర్షియల్ హిట్ అందుకోలేకపోవడం అభిమానుల్లో నిరాశ కలిగిస్తోంది. గతంలో భారీ అంచనాల మధ్య వచ్చిన ఏజెంట్ (Agent Movie) డిజాస్టర్ కావడంతో ఇప్పుడు లెనిన్‌పై ఆశలు పెట్టుకున్నారు. ఒకవైపు వ్యక్తిగత జీవితంలో శుభవార్త రాబోతుందన్న టాక్, మరోవైపు కెరీర్‌లో బ్రేక్ అవసరం – ఈ రెండింట్లో ఏది ముందుగా నిజమవుతుందో చూడాలి. అధికారిక ప్రకటన వచ్చే వరకు అక్కినేని ఫ్యాన్స్ మాత్రం ఊహాగానాలతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి.