ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ప్రస్తుతం దర్శకుడు అట్లీ (Atlee) డైరెక్షన్‌లో ఓ క్రేజీ ప్రాజెక్ట్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ఇండస్ట్రీతో పాటు అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మేకర్స్ కూడా ఈ చిత్రంలో బన్నీ మునుపెన్నడూ కనిపించని పాత్రలో కనిపిస్తాడని స్పష్టంగా చెబుతున్నారు. స్టైల్, యాక్షన్, మాస్ ఎలిమెంట్స్ అన్నీ మిక్స్ అయ్యేలా ఈ సినిమా ఉండబోతుందన్న టాక్ వినిపిస్తోంది. అందుకే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన చిన్న అప్‌డేట్ వచ్చినా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇదిలా ఉండగా, అల్లు అర్జున్ కెరీర్‌లో మాస్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సరైనోడు (Sarrainodu Movie) సీక్వెల్ గురించి చాలా కాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. గీతా ఆర్ట్స్ (Geetha Arts) బ్యానర్ ఈ సీక్వెల్‌ను ఎలాగైనా తెరకెక్కించాలని గతంలో ప్రయత్నించినట్లు సమాచారం. సరైనోడు సినిమాకు వచ్చిన మాస్ రెస్పాన్స్, బాక్సాఫీస్ కలెక్షన్ల దృష్ట్యా పార్ట్ 2 వస్తే మరోసారి రికార్డులు ఖాయమని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే పరిస్థితులు ఇప్పుడు మారినట్లు తెలుస్తోంది.
ఈ సీక్వెల్‌కు దర్శకుడు బోయపాటి శ్రీను (Boyapati Srinu)నే కొనసాగించాలని తొలుత అనుకున్నారట. కానీ ఇటీవలి కాలంలో బోయపాటి ఫామ్‌పై కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)తో తెరకెక్కిన అఖండ – 2 (Akhanda 2) సినిమా అనుకున్న స్థాయిలో ప్రభావం చూపలేదన్న అభిప్రాయం ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోంది. దీంతో సరైనోడు సీక్వెల్ విషయంలో గీతా ఆర్ట్స్ కూడా వెనక్కి తగ్గినట్లు సమాచారం.
ఈ పరిణామాలతో బోయపాటి శ్రీనుతో మరోసారి సినిమా చేయాలన్న ఆలోచనను అల్లు అర్జున్ కూడా విరమించుకున్నట్లు టాక్. ప్రస్తుతం బన్నీ పూర్తిగా అట్లీ సినిమాపైనే ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అందుకే బన్నీ–బోయపాటి కాంబినేషన్‌లో సినిమా ఇప్పట్లో ప్రారంభం అయ్యే అవకాశాలు ఏమాత్రం కనిపించడం లేదు. మొత్తంగా చూస్తే సరైనోడు సీక్వెల్ ఆలోచన ప్రస్తుతానికి పక్కన పెట్టినట్టేనని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.