శ్రీకాంత్ తనయుడు రోషన్ మేక (Roshan Meka) హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఛాంపియన్ (Champion Movie) ఇప్పటికే ఆసక్తికరమైన ప్రమోషనల్ కంటెంట్‌తో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. స్వప్న సినిమాస్ (Swapna Cinemas) అప్‌కమింగ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో యంగ్ హీరోయిన్ అనస్వర రాజన్ (Anaswara Rajan) లీడ్ రోల్‌లో నటిస్తోంది. ప్రదీప్ అద్వైతం (Pradeep Advaitham) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను జీ స్టూడియోస్ (Zee Studios) సమర్పణలో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మిక్కీ జే మేయర్ (Mickey J Meyer) సంగీతం అందించిన పాటలు ఇప్పటికే చార్ట్‌బస్టర్‌గా నిలిచాయి. డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది.
ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో హీరోయిన్ అనస్వర రాజన్ సినిమా విశేషాలను పంచుకున్నారు. వైజయంతి మూవీస్ (Vyjayanthi Movies), స్వప్న సినిమాస్ లాంటి గొప్ప నిర్మాణ సంస్థలతో తెలుగులో లాంచ్ కావడం తనకు అదృష్టంగా భావిస్తున్నానని ఆమె తెలిపారు. తనకు తెలుగు భాష పూర్తిగా రాకపోయినా, యూనిట్ మొత్తం ఎంతో సపోర్ట్ చేశారని, ప్రత్యేకంగా డైరెక్టర్ ప్రదీప్ గారు ప్రతి డైలాగ్‌ను ఓర్పుతో నేర్పించారని చెప్పారు. వారి సహకారంతోనే తాను తెలుగులో డైలాగ్స్ చక్కగా చెప్పగలిగానని, ఆ ప్రయత్నం ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశిస్తున్నట్లు వెల్లడించారు.
తెలుగు ప్రేక్షకులపై అనస్వర రాజన్ ప్రత్యేకంగా మాట్లాడారు. తెలుగు ఆడియన్స్ చాలా గొప్ప మనసున్నవారని, తాను ఇతర భాషల్లో చేసిన సినిమాలు చూసి కూడా ఎంతో ప్రేమతో సందేశాలు పంపారని తెలిపారు. ఆ ప్రోత్సాహమే తనకు మరింత బలాన్ని ఇస్తుందని చెప్పారు. తెలుగులో తన తొలి సినిమా ఛాంపియన్‌ను కూడా ప్రేక్షకులు అంతే గొప్పగా ఆదరిస్తారని నమ్మకం వ్యక్తం చేశారు. తెలుగు ఇండస్ట్రీలో సినిమాలు చాలా గ్రాండ్‌గా ఉంటాయని, ఇక్కడ ఫిల్మ్ మేకర్స్, ప్రొడ్యూసర్స్ ఎంతో సపోర్టివ్‌గా ఉంటారని చెప్పుకొచ్చారు.
ఇక కథ విషయానికి వస్తే, ఛాంపియన్ కథ విన్నప్పుడు తనకు చాలా ఎమోషనల్‌గా అనిపించిందని అనస్వర రాజన్ తెలిపారు. ఇందులో తాను చేసిన చంద్రకళ క్యారెక్టర్ (Chandrakala Character) ప్రేక్షకుల మనసుల్లో ఎప్పటికీ నిలిచిపోతుందని ఆమె నమ్మకం వ్యక్తం చేశారు. రోషన్ మేక తనకు చాలా స్వీట్ కో-స్టార్ అని, డైలాగ్స్, డ్యాన్స్‌లో ఎంతో సపోర్ట్ చేశారని చెప్పారు. అలాగే వింటేజ్ పీరియడ్ సినిమాలు చేయడం తనకు చాలా ఇష్టమని, చంద్రకళ పాత్ర కోసం రెడీ అవ్వడం ఎంతో ఆనందం ఇచ్చిందన్నారు. హైదరాబాద్ ఫుడ్ విషయానికి వస్తే, ఇక్కడ బిర్యానీ తనకు చాలా ఇష్టమని, రామ్ చరణ్ (Ram Charan) ట్రైలర్ లాంచ్ చేయడం తనకు ప్రత్యేక ఆనందాన్ని ఇచ్చిందని, మగధీర (Magadheera Movie) తన ఫేవరెట్ సినిమాల్లో ఒకటని తెలిపారు.