మంచు మనోజ్ (Manchu Manoj) హీరోగా నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా డేవిడ్ రెడ్డి (David Reddy) తాజాగా చర్చనీయాంశంగా మారింది. బ్రిటీష్ ఇండియా కాలం (British India Era) నాటి కథతో రూపొందుతున్న ఈ మూవీ టీజర్‌ను చిత్ర బృందం బుధవారం విడుదల చేయగా, ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. అయితే టీజర్ కంటే ఎక్కువగా ఇప్పుడు సినిమా టైటిల్‌పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ‘డేవిడ్ రెడ్డి’ అనే పేరుపై ఓ వర్గం నెటిజన్లు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది.
సినిమా టైటిల్స్ విషయంలో ఫిలిం మేకర్స్ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. టైటిల్ క్యాచీగా ఉండాలి, త్వరగా జనాల్లోకి వెళ్లాలి అన్న ఉద్దేశంతో అనేక ఆలోచనలు చేసి ఖరారు చేస్తుంటారు. అయితే కొన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన సర్‌నేమ్స్‌ను సినిమా టైటిల్స్‌గా ఉపయోగించడం, లేదా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలకు అలాంటి పేర్లు పెట్టడం గతంలోనూ వివాదాలకు దారి తీసింది. కథ డిమాండ్ మేరకు పెట్టిన టైటిల్స్ ఒక ఎత్తు అయితే, అవసరం లేకున్నా క్రేజ్ కోసం పెట్టారని విమర్శలు రావడం మరో ఎత్తు. ఇప్పుడు డేవిడ్ రెడ్డి (David Reddy) టైటిల్ కూడా అదే కోవలో చర్చకు వచ్చింది.
ఈ సినిమాపై ఓ నెటిజన్ ట్విట్టర్ (Twitter)లో స్పందిస్తూ, “ఇంకెన్నాళ్లు బ్రో రెడ్డి ట్యాగ్స్. డేవిడ్ చౌ అని పెట్టుకో, 200 సెంటర్స్‌లో 100 డేస్ ఆడుతుంది” అంటూ వ్యంగ్యంగా కామెంట్ చేశాడు. ఇక్కడ ‘చౌ’ అనే పదాన్ని చౌదరి అనే అర్థంలో ఉపయోగించాడన్న విషయం స్పష్టమే. ఈ ట్వీట్‌కు హీరో మంచు మనోజ్ స్పందిస్తూ, “నేను ట్రై చేశాను బ్రో.. కానీ వాళ్లు నా మాట వినలేదు” అని కౌంటర్ ఇచ్చారు. ఈ వ్యాఖ్యతో దర్శక నిర్మాతలు తన మాట వినలేదా, లేక ఆ ట్యాగ్‌కు సంబంధించి ఇతర కారణాలున్నాయా అనే అంశంపై భిన్న అర్థాలు వినిపిస్తున్నాయి.
చాలా ఏళ్ల తర్వాత హీరోగా మంచు మనోజ్ చేస్తున్న సినిమా కావడంతో డేవిడ్ రెడ్డి సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. హనుమ రెడ్డి యక్కంటి (Hanuma Reddy Yakkanti) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వెంకట్ రెడ్డి (Venkat Reddy), భరత్ మోటుకూరి (Bharath Motukuri) నిర్మిస్తున్నారు. ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీ టీజర్‌కు వచ్చిన స్పందన సానుకూలంగా ఉన్నప్పటికీ, టైటిల్ వివాదం మాత్రం సినిమాకు అదనపు పబ్లిసిటీ తీసుకొచ్చింది. ఈ చర్చలు సినిమా విడుదల వరకు ఎలా కొనసాగుతాయో చూడాలి.
I tried bro. They dint listen 😅 https://t.co/usrjIMrtm6
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) December 17, 2025