భారత రైల్వేలో ప్రతిరోజూ కోట్లాది మంది ప్రయాణిస్తున్నారు. వారిలో చాలా మంది ముందుగానే IRCTC ద్వారా ఆన్‌లైన్‌లో టికెట్‌లు బుక్ చేసుకుంటారు. కానీ కొన్ని సార్లు ప్లాన్ మార్చుకోవాల్సి వస్తుంది లేదా టికెట్ కన్ఫాం కాకపోవచ్చు. అప్పుడు టికెట్ క్యాన్సిల్ అయితే ఎంత ఫీజు కట్ అవుతుంది? IRCTC నియమాలు ఏమంటున్నాయో చూద్దాం.
🔹 ఆటోమేటిక్ క్యాన్సిలేషన్‌పై ఛార్జీలు వర్తిస్తాయా.?
మీరు వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న టికెట్ బుక్ చేసుకున్నట్లయితే, చార్ట్ తయారు అయిన తర్వాత కూడా కన్ఫామ్ కాకపోతే, ఆ టికెట్ ఆటోమేటిక్‌గా రద్దు అవుతుంది.
👉 ఇలాంటి సందర్భాల్లో ఎలాంటి రద్దు ఛార్జీలు ఉండవు.
IRCTC మీ ఖాతాలో పూర్తి నగదును తిరిగి జమ చేస్తుంది. ప్రయాణికులు ఎటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు.
తత్కాల్ టికెట్‌ల విషయంలో మాత్రం నియమాలు వేరు. సీటు దొరకకపోతే క్లర్కేజ్ ఫీజుగా కొద్దిపాటి మొత్తం తగ్గించి మిగిలిన డబ్బు తిరిగి వస్తుంది.
🔹 మీరు స్వయంగా టికెట్ క్యాన్సిల్ చేస్తే.?
ఇలాంటి సందర్భాల్లో రైల్వే నిబంధనల ప్రకారం క్యాన్సిలేషన్ ఛార్జీలు వర్తిస్తాయి.
48 గంటల కంటే ముందు టికెట్ రద్దు చేస్తే తక్కువ కట్ అవుతుంది, కానీ ప్రయాణ సమయం దగ్గర పడేకొద్దీ డబ్బు తగ్గుతుంది.
సాధారణ ఛార్జీలు ఇలా ఉంటాయి:
స్లీపర్ క్లాస్ (Sleeper): ₹120
సెకండ్ AC: ₹200
ఫస్ట్ AC: ₹240
ఒకవేళ మీరు చార్ట్ తయారు చేసిన తర్వాత టికెట్ క్యాన్సిల్ చేస్తే, రిఫండ్ అందదు. వెయిటింగ్ లిస్ట్ టికెట్‌ను చార్ట్ ముందు రద్దు చేస్తే తక్కువ మొత్తమే కట్ అవుతుంది.
🔹 IRCTC స్పష్టత:
ఇటీవల సోషల్ మీడియాలో ఒక యూజర్ “తన టికెట్ ఆటోమేటిక్‌గా రద్దు అయినా ఛార్జీలు కట్ అయ్యాయి” అని ఫిర్యాదు చేశారు. దానికి IRCTC స్పందిస్తూ – “కేవలం ప్రయాణికుడే స్వయంగా రద్దు చేస్తేనే ఛార్జీలు వర్తిస్తాయి, సిస్టమ్ ఆటోమేటిక్‌గా రద్దు చేస్తే కాదు” అని తెలిపింది.