పాన్ వరల్డ్ లెవెల్‌లో తెరకెక్కుతున్న మహేష్ బాబు, ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్ సినిమా వారణాసిపై దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకుల్లో అద్భుతమైన క్రేజ్ నెలకొంది. ఎప్పుడూ లేని విధంగా టాలీవుడ్ మాత్రమే కాదు, బాలీవుడ్, హాలీవుడ్ వరకు ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి అప్‌డేట్‌పై భారీ చర్చ జరుగుతోంది. ఈ క్రేజ్‌ను మరింతగా పెంచుతున్నది గ్లోబల్ స్టార్డ్ ప్రియాంక చోప్రా ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించడం. చాలా ఏళ్ల తర్వాత భారతీయ సినీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ బ్యూటీ, రాజమౌళి భారీ ప్రాజెక్ట్‌లో భాగమవ్వడం పెద్ద సెన్సేషన్‌గా మారింది. అందుకే ఈ పాత్ర కోసం ఆమె ఎంత పారితోషికం తీసుకుంటుందన్న ప్రశ్న అందరిలో ఆసక్తిని రేపుతోంది.
వారణాసి టైటిల్ రివీల్ ఈవెంట్‌లో ప్రియాంక చోప్రా కనిపించిన తీరు అభిమానులను పూర్తిగా ఆకట్టుకుంది. తెల్ల లంగావోణిలో సంప్రదాయ భారతీయ అందాన్ని కలగలిపిన లుక్‌తో ఆమె నిజంగా దేవకన్యలా మెరిసింది. ఈవెంట్ తరువాత సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. ఈ ప్రత్యేక వేడుకతో వారణాసి చిత్రం మీద హైప్ మరింత రెట్టింపు అయింది. రాజమౌళి దర్శకత్వంలో వస్తున్నందున, భారతీయ సినిమాల్లో ఇప్పటి వరకు చూడని రీతిలో విజువల్ ట్రీట్‌గా ఈ సినిమా రూపొందబోతుందని ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాలు ప్రస్తావిస్తున్నాయి. అటువంటి భారీ చిత్రంలో ప్రియాంక కథానాయికగా నటించనుండటం మరింత ప్రత్యేకం.
ప్రియాంక చోప్రా హాలీవుడ్‌లో బిజీగా ఉండటం, ఆమె అంతర్జాతీయ మార్కెట్‌లో ఉన్న పెద్ద డిమాండ్ దృష్ట్యా, వారణాసి సినిమాలో నటించేందుకు ఆమె భారీ మొత్తాన్ని ఛార్జ్ చేసినట్టు ఇండస్ట్రీలో వార్తలు వెలువడ్డాయి. తాజా సమాచారం ప్రకారం, ప్రియాంక ఈ చిత్రానికి రూ.30 కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటోంది. ఈ మొత్తంతో ఆమె భారతీయ సినిమా పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకున్న నటి అయ్యిందని టాక్. సాధారణంగా బాలీవుడ్ టాప్ హీరోయిన్లు 10 నుండి 15 కోట్ల వరకు మాత్రమే తీసుకుంటారు. అయితే వారణాసి వంటి భారీ ప్రాజెక్ట్, రాజమౌళి వంటి వరల్డ్ క్లాస్ దర్శకుడు, మహేష్ బాబు వంటి సూపర్ స్టార్ కాంబినేషన్ వచ్చేసరికి ప్రియాంకకు భారీ రీమ్యునరేషన్ ఆఫర్ చేయాల్సి వచ్చింది. ఈ సమాచారంతో ఇండస్ట్రీ అంతా షాక్ అయింది.
ఇక ప్రియాంక నటిస్తున్న పాత్ర పేరు మందాకిని. ఇప్పటికే విడుదలైన ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉండబోతోందో చెప్పేస్తోంది. చీరకట్టులో, చేతిలో గన్ పట్టుకున్న విధంగా కనిపించిన పోస్టర్ ప్రేక్షకుల్లో భారీ ఉత్సాహం రేకెత్తించింది. రాజమౌళి సినిమాల్లో ప్రతి పాత్రకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. అందుకే ప్రియాంక పాత్రను చాలా డెప్త్, బలం, భావోద్వేగాలతో తీర్చిదిద్దారని తెలుస్తోంది. బాలీవుడ్, హాలీవుడ్‌ను ఒకే సారి హ్యాండిల్ చేస్తూ ముందుకు సాగుతున్న ప్రియాంక, ఈ కథలో కీలకమైన పాత్రను పోషించబోతున్నందున, ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ అవుతుందని అందరూ నమ్ముతున్నారు.
వారణాసి చిత్రం 2027లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రస్తుతానికి షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా ఇప్పటికే ఆఫ్రికన్ జంగిల్ సెట్‌లు, గ్లోబల్ లొకేషన్స్, భారీ యాక్షన్ బ్లాక్స్‌తో భారీ స్థాయిలో తెరకెక్కుతోంది. పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా నటించడం కూడా ఈ ప్రాజెక్ట్‌ను విశేషంగా మార్చుతోంది. ప్రియాంక చోప్రా, మహేష్ బాబు, రాజమౌళి — ఈ ముగ్గురి కాంబినేషన్‌నే ప్రేక్షకులు సినిమాకు సగం హిట్ ఇచ్చినట్లే భావిస్తున్నారు. ఇక సినిమా విడుదలైతే ఇండియన్ సినిమా హిస్టరీలో మరో మైలురాయి ఖాయం.