తక్కువ సినిమాలే చేసినప్పటికీ యూత్ ఆడియన్స్‌లో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ రుక్మిణి వాసంత్ (Rukmini Vasanth). తెలుగులో ఈమెకు మంచి పరిచయం తీసుకొచ్చింది ‘సప్త సాగరాలు ఎల్లో – సైడ్ A/B’ (Sapta Saagaralu Eello – Side A/B) సిరీస్. హార్డ్ హిట్టింగ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ రెండు సినిమాల్లో రుక్మిణి నటన ప్రేక్షకుల్ని భావోద్వేగాలకు గురి చేసింది. ముఖ్యంగా ఆమె కళ్లలో కనిపించిన నొప్పి, డైలాగ్ డెలివరీ ఆడియన్స్ చేత కన్నీళ్లు పెట్టించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
ఈ సిరీస్‌కు ముందు రుక్మిణి వాసంత్ 2019లో విడుదలైన ‘బీర్బల్ త్రయాలజీ’ (Birbal Trilogy) లో హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత ‘అప్ స్టార్ట్స్’ (Upstarts) అనే హిందీ సినిమాలోనూ కనిపించింది. అయితే ఈ రెండు సినిమాల తర్వాత ఆమె పెద్ద గ్యాప్ తీసుకుంది. ఆ గ్యాప్‌నే తన కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా మార్చుకుంటూ ‘సప్త సాగరాలు ఎల్లో’ సిరీస్‌ను ఎంపిక చేసుకుంది. ఆ సినిమా విడుదల తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాలేదని సినీ వర్గాలు అంటున్నాయి.
ఈ సినిమా విజయం తర్వాత రుక్మిణి వాసంత్ కన్నడతో పాటు తెలుగు, తమిళం, ఇతర భాషల్లో వరుస అవకాశాలు అందుకుంటూ ఫుల్ బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. కథ, పాత్ర బలంగా ఉంటే భాషతో సంబంధం లేకుండా చేయడానికి ఆమె సిద్ధంగా ఉందని ఇప్పటికే నిరూపించింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఆమె నటించిన భారీ చిత్రం ‘కాంతారా 2’ (Kantara 2) కమర్షియల్‌గా ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ‘కాంతారా 2’ సినిమాలో తన పాత్ర గురించి రుక్మిణి వాసంత్ ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఈ చిత్రంలో తాను విలన్ క్యారెక్టర్ చేయడం తన కెరీర్‌లోనే అత్యంత ప్రమాదకరమైన ప్రయోగమని ఆమె చెప్పింది. సాధారణంగా కెరీర్ ఆరంభంలో ఉన్న హీరోయిన్లు నెగటివ్ లేదా విలన్ పాత్రలు చేయడానికి భయపడతారని, తానూ మొదట అలానే భయపడినట్లు వెల్లడించింది.
“ఇప్పుడే కెరీర్ మొదలైంది. ఇలాంటి సమయంలో విలన్ క్యారెక్టర్ చేస్తే ఆడియన్స్ నన్ను ద్వేషిస్తారేమో, అలా అయితే నా కెరీర్ అక్కడితో ఆగిపోతుందేమో అని చాలా భయపడ్డాను. కానీ చివరికి ఏదైతే అది అనుకుని ఈ క్యారెక్టర్ చేయాలని నిర్ణయించుకున్నాను” అని రుక్మిణి వాసంత్ (Rukmini Vasanth) తెలిపింది. ఈ నిర్ణయమే ఇప్పుడు తన కెరీర్‌కు ఎంత ప్లస్ అయిందో ఆమె మాటల్లోనే స్పష్టంగా కనిపిస్తోంది.
ఆమె ఇంకా మాట్లాడుతూ, ఆడియన్స్ తనను విలన్‌గా ద్వేషిస్తారని అనుకున్నానని, కానీ ఆశ్చర్యకరంగా అదే పాత్ర ద్వారా ప్రేక్షకుల ఆదరణ లభించిందని చెప్పింది. సినిమా ఆరంభం నుంచి ప్రీ క్లైమాక్స్ వరకు తన పాత్ర విలన్ అని ఎవ్వరూ ఊహించలేదని, చివరి ట్విస్ట్ ప్రేక్షకులను థ్రిల్‌కు గురి చేసిందని వివరించింది. అదే ఈ పాత్రకు బాగా కలిసి వచ్చిందని ఆమె అభిప్రాయపడింది.
‘కాంతారా 2’ (Kantara 2) సినిమా తనకు భవిష్యత్తులో ఇంకా పవర్‌ఫుల్ విలన్ రోల్స్ చేయడానికి ధైర్యాన్ని ఇచ్చిందని రుక్మిణి వాసంత్ స్పష్టం చేసింది. హీరోయిన్ అంటే కేవలం పాజిటివ్ పాత్రలకే పరిమితం కావాల్సిన అవసరం లేదని, కథ డిమాండ్ చేస్తే ఎలాంటి పాత్రైనా చేయవచ్చని ఈ సినిమా తనకు నేర్పిందని ఆమె చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం రుక్మిణి వాసంత్ ఎన్టీఆర్ (NTR), ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. అంతేకాదు, రామ్ చరణ్ (Ram Charan), సుకుమార్ (Sukumar) కాంబినేషన్‌లో రాబోయే మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో కూడా ఆమె హీరోయిన్‌గా ఎంపికైనట్లు సమాచారం. ఈ రెండు సినిమాలు నిజమైతే, రుక్మిణి కెరీర్ మరో స్థాయికి వెళ్లడం ఖాయమనే అభిప్రాయం వినిపిస్తోంది.
మొత్తానికి ‘సప్త సాగరాలు ఎల్లో’ (Sapta Saagaralu Eello) తో ఎమోషనల్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న రుక్మిణి వాసంత్, ‘కాంతారా 2’ (Kantara 2) తో విలన్‌గా కూడా తన సత్తా చాటింది. రిస్క్ తీసుకుని చేసిన ఈ ప్రయోగమే ఆమెకు కొత్త దారులు తెరిచింది. రాబోయే రోజుల్లో ఈ హీరోయిన్ ఇంకా ఎంత దూరం వెళ్తుందో చూడాలి మరి.