మామూలు సాదా సీదా సినిమాలు తెరకెక్కించడమే ఒక సవాలుగా మారిన ఈ రోజుల్లో, అడ్వెంచర్ నేపథ్యంతో సినిమాలు చేయడం అంటే అది నిజంగా సాహసమే. ఇక అందులో భాగంగా రియల్ స్టంట్స్ చేయాలంటే హీరోలకు అది ప్రాణాల మీదకు తెచ్చుకునే పరీక్షలాంటిదని చెప్పాలి. అలాంటి పరిస్థితుల్లో యంగ్ హీరో ఆది (Aadi) నటిస్తున్న అవైటెడ్ సినిమా శంబాల (Shambala Movie) షూటింగ్ సమయంలో కొన్ని షాకింగ్ సంఘటనలు చోటు చేసుకున్నాయని చిత్రబృందం వెల్లడించింది.
శంబాల సినిమా షూటింగ్‌లో భాగంగా ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్న సమయంలో హీరో ఆది తీవ్రంగా గాయపడ్డారని సమాచారం. రాత్రి పూట జరిగిన ఈ షూటింగ్‌లో అనేక మంది నటీనటులు పాల్గొన్నారు. డేంజరస్ స్టంట్స్‌తో కూడిన ఆ యాక్షన్ సీన్ చేస్తుండగానే ఆదికి గాయాలు అయ్యాయని తెలుస్తోంది. పరిస్థితి కాస్త ఆందోళనకరంగా మారినా, షూటింగ్ అక్కడితో ఆపేయకుండా ముందుకు కొనసాగిందని టీం తెలిపింది.
గాయాలైనప్పటికీ షూటింగ్‌కు ఎలాంటి ఆటంకం కలగకుండా ఆది వ్యవహరించిన తీరు అందరినీ ఆకట్టుకుందట. గాయాలతోనే ఆ రాత్రి మొత్తం షూటింగ్ పూర్తి చేసి, సినిమా పట్ల తనకు ఉన్న డెడికేషన్‌ను చూపించారని చిత్రబృందం ప్రశంసలు కురిపిస్తోంది. హీరోగా మాత్రమే కాకుండా, నటన పట్ల పూర్తి కమిట్‌మెంట్ ఉన్న వ్యక్తిగా ఆది మరోసారి తనను తాను నిరూపించుకున్నాడని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఈ ఘటన సినిమా మీద అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచింది.
డీసెంట్ బజ్‌ను సొంతం చేసుకున్న శంబాల సినిమాను షైనింగ్ పిక్చర్స్ (Shining Pictures) బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభిమోజు (Rajashekhar Annabhimoju), మహీధర్ రెడ్డి (Mahidhar Reddy) నిర్మించారు. యగంధర్ ముని (Yagandhar Muni) దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అర్చన అయ్యర్ (Archana Iyer), స్వసిక (Swasika), రవివర్మ (Ravi Varma), మధునందన్ (Madhu Nandan), శివ కార్తీక్ (Shiva Karthik) కీలక పాత్రల్లో నటించారు. శ్రీ చరణ్ పాకాల (Sri Charan Pakala) అందించిన మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు మరో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనుందని సమాచారం. ఈ అడ్వెంచర్ యాక్షన్ మూవీని డిసెంబర్ 25న భారీ ఎత్తున థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు.