యూట్యూబ్‌లో 2025 మ్యూజిక్ మేనియా
2025 సంవత్సరం సినిమా సంగీత ప్రపంచానికి ఒక మైలురాయిగా నిలిచింది. భాషతో సంబంధం లేకుండా పాటలు యూట్యూబ్ (YouTube)లో విపరీతమైన వ్యూస్ సాధించాయి. స్టార్ హీరోల సినిమాల నుంచే కాకుండా, కంటెంట్ బలంగా ఉన్న పాటలు సోషల్ మీడియాలో (Social Media) ట్రెండ్స్ సెట్ చేశాయి. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ (Instagram Reels), యూట్యూబ్ షార్ట్స్ (YouTube Shorts) ద్వారా పాటలు ప్రతి మూలకు చేరాయి. కొన్ని సాంగ్స్ విడుదలైన గంటల్లోనే మిలియన్ల వ్యూస్ సాధించి సంగీత ప్రియులను ఆశ్చర్యపరిచాయి.
మ్యూజిక్ డైరెక్టర్స్ మ్యాజిక్
ఈ ఏడాది పాటల విజయంలో కీలక పాత్ర పోషించింది మ్యూజిక్ డైరెక్టర్స్ ప్రతిభ. అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander), సంతోష్ నారాయణన్ (Santhosh Narayanan), ఏఆర్ రెహమాన్ (A R Rahman), జీవి ప్రకాష్ (GV Prakash) వంటి సంగీత దర్శకులు అందించిన ట్యూన్స్ యూత్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. హుక్ స్టెప్ప్స్, బీట్ డ్రాప్స్, ఎనర్జిటిక్ మ్యూజిక్ వల్ల పాటలు కేవలం సినిమాల్లోనే కాకుండా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలోనూ ట్రెండ్ అయ్యాయి.
2025లో అత్యధిక వ్యూస్ సాధించిన పాటలు
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కూలీ సినిమాలోని మోనికా పాట ఈ ఏడాది యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్ సాధించిన పాటగా నిలిచింది. ఈ పాట ఏకంగా 314 మిలియన్ వ్యూస్ అందుకుంది. అనిరుధ్ మ్యూజిక్, పూజా స్టెప్స్ యూత్‌ను ఊర్రూతలూగించాయి. అలాగే గోల్డెన్ స్పారో సాంగ్, తమిళంలోని యేడి పాట కూడా భారీగా వైరల్ అయ్యాయి. సూర్య నటించిన రెట్రో సినిమాలోని కనిమా పాట, కన్నడి పూవే పాటలు కూడా మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకున్నాయి.
తెలుగు పాటల ప్రభంజనం
తెలుగులో ఏడాది ఆరంభంలోనే సంక్రాంతికి వస్తున్నాం సినిమాలోని గోదారి గట్ట పాట సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమాలోని జరగండి జరగండి పాట మాస్ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంది. డాగు మహారాజ్ చిత్రంలోని దబిడి దబిడి, నా బంగారు కూన పాటలు హిట్ అయ్యాయి. తండేల్ సినిమాలోని బుజ్జితల్లి, ఓజీ సినిమాలోని టైటిల్ సాంగ్ కూడా ట్రెండింగ్‌లో నిలిచాయి.
చిన్న సినిమాల నుంచి పెద్ద ట్రెండ్స్ వరకు
స్టార్ సినిమాలే కాకుండా చిన్న సినిమాల పాటలు కూడా 2025లో సర్‌ప్రైజ్ చేశాయి. ఫైర్ స్టార్మ్, సువ్వి సువ్వి పాటలు ఎక్కువగా వినిపించాయి. ఆంధ్రా కింగ్ సినిమాలోని నువ్వుంటే చాలే, చిన్ని గుండెలో పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తెలుసు కదా సినిమాలోని నచ్చేసిందే సాంగ్ చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. కోర్ట్ సినిమాలోని కథలెన్నో చెప్పారు, లిటిల్ హార్ట్స్‌లోని హాలో అని పాటలు కూడా యూత్‌తో బలంగా కనెక్ట్ అయ్యాయి. వైబ్ ఉంది బేబీ, అదిదా సర్‌ప్రైజూ, వైరల్ వయ్యారి వంటి పాటలు మాస్ ఆడియన్స్‌ను ఊపేశాయి.
మొత్తం గా చెప్పాలంటే
2025లో యూట్యూబ్‌లో పాటల ట్రెండ్ కొత్త స్థాయికి చేరింది. స్టార్ హీరోల సినిమాల పాటలతో పాటు చిన్న సినిమాల సాంగ్స్ కూడా రికార్డులు క్రియేట్ చేశాయి. ఈ ఏడాది సంగీత ప్రపంచం నిజంగా ఒక గోల్డెన్ ఫేజ్‌గా నిలిచిందని చెప్పొచ్చు.