అమెజాన్ ఇయర్ ఎండ్ సేల్‌లో అదిరిపోయే డీల్
వివో లవర్స్‌కు నిజంగా ఇది గుడ్ న్యూస్. అమెజాన్ (Amazon) ఇయర్ ఎండ్ సేల్ సందర్భంగా వివో X200 (Vivo X200) ఫోన్‌పై భారీ డిస్కౌంట్ అందుబాటులోకి వచ్చింది. పర్ఫార్మెన్స్, డిజైన్, కెమెరా అన్నింట్లోనూ ప్రీమియం ఫీల్ ఇచ్చే ఈ ఫోన్‌ను ఇప్పుడు తక్కువ ధరకే కొనుగోలు చేసే అవకాశం వచ్చింది. కొత్త ఫోన్ కొనాలనుకుంటున్న వారికి, ముఖ్యంగా కెమెరా ఫోకస్డ్ యూజర్లకు ఇది మిస్ అవ్వకూడని ఆఫర్‌గా మారింది.
ధరలో భారీ తగ్గింపు.. ఎంత సేవ్ అవుతుందంటే
ప్రారంభంలో ఈ వివో X200 ఫోన్ ధర రూ.74,999గా ఉంది. అయితే ప్రస్తుతం అమెజాన్‌లో ఈ ఫోన్ రూ.68,999కే లభిస్తోంది. అంటే ఫ్లాట్‌గా రూ.6వేల డిస్కౌంట్ దక్కుతోంది. దీనికి అదనంగా అమెజాన్ పే ఐసీఐసీఐ (Amazon Pay ICICI) బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలు చేస్తే మరింత బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. ఫ్రీ ఈఎంఐ (No Cost EMI) ఆప్షన్‌ను ఉపయోగిస్తే ఈ ఆఫర్ మరింత ఆకర్షణీయంగా మారుతుంది.
ఈఎంఐ, ట్రేడ్ ఇన్ ఆప్షన్లతో ఇంకా లాభం
ఒక్కసారిగా మొత్తం డబ్బు చెల్లించలేని వారికి ఈ ఫోన్‌ను నెలకు సుమారు రూ.3,345 ఈఎంఐతో కొనుగోలు చేసే అవకాశం ఉంది. అలాగే మీ పాత గాడ్జెట్‌ను అప్‌గ్రేడ్ చేయాలనుకుంటే ట్రేడ్ ఇన్ (Trade In) ఆప్షన్ ఉపయోగించుకోవచ్చు. డివైజ్ బ్రాండ్, మోడల్, కండిషన్‌ను బట్టి గరిష్టంగా రూ.44,450 వరకు అదనపు డిస్కౌంట్ పొందే ఛాన్స్ కూడా ఉంది. దీంతో ఈ డీల్ మరింత లాభదాయకంగా మారుతోంది.
డిస్‌ప్లే, ప్రాసెసర్‌లో ప్రీమియం ఫీల్
వివో X200 ఫోన్ 6.67 అంగుళాల అమోల్డ్ (AMOLED) డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో స్మూత్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. HDR10 ప్లస్ సపోర్ట్‌తో పాటు 4,500 నిట్స్ బ్రైట్‌నెస్ ఉండటం వల్ల అవుట్‌డోర్‌లో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఫోన్‌లో డైమెన్సిటీ 9400 (Dimensity 9400) చిప్‌సెట్ ఉండటంతో గేమింగ్, మల్టీటాస్కింగ్‌లో ఎలాంటి ఇబ్బంది ఉండదు.
బ్యాటరీ, కెమెరాతో పూర్తి ప్యాకేజ్
ఈ ఫోన్‌లో 5,800mAh బ్యాటరీతో పాటు 90W ఫాస్ట్ ఛార్జింగ్ (Fast Charging) సపోర్ట్ ఉంది. తక్కువ సమయంలోనే ఫుల్ ఛార్జ్ అవుతుంది. కెమెరా విభాగంలో మూడు కెమెరాల సెటప్‌తో ఫోటోగ్రఫీ లవర్స్‌ను ఆకట్టుకుంటుంది. అదనంగా ఐపీ69 (IP69) రేటింగ్‌తో వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కూడా ఉంది. నాలుగు సంవత్సరాల ఆండ్రాయిడ్ అప్‌డేట్స్ అందించనుండటం దీన్ని లాంగ్ టర్మ్ యూజ్‌కు సరైన ఫోన్‌గా మార్చుతోంది.
మొత్తం గా చెప్పాలంటే
అమెజాన్ సేల్‌లో వివో X200పై వచ్చిన ఈ డిస్కౌంట్ నిజంగా డోంట్ మిస్ ఆఫర్. ప్రీమియం ఫీచర్లతో కూడిన ఈ ఫోన్‌ను తక్కువ ధరకు కొనాలనుకునే వారికి ఇది బెస్ట్ ఛాన్స్ అని చెప్పొచ్చు.