Article Body
విద్యుత్ ఉత్పత్తి అంటే పెద్ద డ్యామ్‌లు, భారీ టర్బైన్‌లు, పర్వత ప్రాంతాలు, నదులు — ఇవే మనకు వెంటనే గుర్తుకు వస్తాయి. కానీ ఇజ్రాయెల్ మాత్రం ప్రపంచం ఊహించని విప్లవాత్మక ఆలోచనను అమలు చేస్తోంది. నగరాల మునిసిపల్ వాటర్ పైప్‌లైన్‌ల్లోనే విద్యుత్ ఉత్పత్తి చేస్తూ, భవిష్యత్తు ఎనర్జీ నమూనాను మార్చేస్తోంది. సాంప్రదాయ పవర్ జనరేషన్‌కు పూర్తిగా భిన్నంగా ఉన్న ఈ “మైక్రో-హైడ్రో టెక్నాలజీ” ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది.
ఇజ్రాయెల్ ఇంజినీర్లు అధిక ఒత్తిడి (హై ప్రెజర్) కలిగిన నగరాల నీటి పైప్లైన్లలో చిన్న టర్బైన్‌లను ఏర్పాటు చేశారు. పైప్‌లో నీరు సహజ ఒత్తిడితో ప్రవహిస్తుండగా, టర్బైన్ బ్లేడ్లు తిరిగి విద్యుత్ తయారవుతుంది. ఆశ్చర్యమేమిటంటే — ఈ టెక్నాలజీ ద్వారా నీటి సరఫరా వేగం, ఒత్తిడి ఏ మాత్రం తగ్గదు. నీరు తన దారిలో ఎలా వెళ్తుందో అలాగే వెళుతుంది… కానీ ప్రయాణంలోనే పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ఈ ప్రాజెక్ట్‌ను ఇజ్రాయెల్ వాటర్ అథారిటీ, పలు ఇంజినీరింగ్ విశ్వవిద్యాలయాలు కలిసి అభివృద్ధి చేశాయి. ముఖ్యంగా “మైక్రో హైడ్రో జెనరేటర్స్” పై పనిచేసిన పరిశోధకుల ప్రయోగాలు ఇప్పుడు పెద్ద పెద్ద నగరాలకు ఆశీర్వాదంలా మారాయి. పైప్‌లైన్‌లలో వచ్చే విద్యుత్ పరిమాణం ఎక్కువ కాకపోతేనా? సరే… కానీ ఈ పవర్‌తో సిటీ వాటర్ సెన్సింగ్ సిస్టమ్‌లు, శుద్ధి కేంద్రాలు, పబ్లిక్ లైటింగ్, చిన్న సదుపాయాలు — ఇవన్నీ నడిపేయచ్చు.
ఇజ్రాయెల్ ప్రత్యేకత ఏమిటంటే — ఈ సిస్టమ్‌ను కొత్తగా నిర్మించాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఉన్న పైప్‌లైన్స్‌లోనే చిన్న మార్పుతో టర్బైన్ సెక్షన్‌ను జోడిస్తే చాలు. ఖర్చు తక్కువ, మెయింటెనెన్స్ చాలా తక్కువ, విద్యుత్ ఉత్పత్తి మాత్రం నిరవధికంగా కొనసాగుతుంది. సాలార్‌కు సౌర శక్తి అందుబాటులో లేకపోయిన ప్రదేశాల్లో… విండ్ టర్బైన్‌లు పెట్టడానికి స్థలం లేకపోయినా… ఈ కొత్త టెక్ ఉత్తమ పరిష్కారం అవుతోంది.
పర్యావరణ పరంగా ఈ ప్రాజెక్ట్ చాలా పెద్ద ఆశీర్వాదం. అదనపు శక్తి వనరులు అవసరం లేకుండానే, నగరాల రోజువారి నీటి ప్రవాహం నుంచే పరిశుభ్రమైన విద్యుత్ లభిస్తోంది. కార్బన్ ఎమిషన్లు తగ్గుతున్నాయి. శక్తి సరఫరా నిరంతరాయంగా కొనసాగుతోంది. ప్రపంచంలోని అనేక దేశాలు ఇప్పటికే ఇజ్రాయెల్ నమూనాను అధ్యయనం చేస్తూ, నగర నీటి వ్యవస్థల్లో ఇది ఎలా అమలు చేయాలన్న దానిపై సీరియస్‌గా ఆలోచిస్తున్నాయి.

Comments