Article Body
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 (Bigg Boss Telugu Season 9) గ్రాండ్ ఫినాలేకు మూడే రోజులు మిగిలి ఉండటంతో ప్రేక్షకుల్లో భారీ ఉత్కంఠ నెలకొంది. ఈ సీజన్ మొదలైనప్పటి నుంచే విన్నర్ ఎవరు అన్న అంశంపై పెద్ద చర్చ నడుస్తుండగా, చివరి వారం దగ్గరపడుతున్న కొద్దీ పోటీ మరింత ఉత్కంఠభరితంగా మారింది. మొదటినుంచి సీరియల్ బ్యూటీ తనూజ (Tanuja) పేరు బలంగా వినిపించినప్పటికీ, ఫైనల్ వీక్‌లో సమీకరణాలు పూర్తిగా మారిపోయినట్లు కనిపిస్తోంది.
ప్రస్తుతం టైటిల్ రేస్‌లో ఇమ్మాన్యుయేల్ (Emmanuel), కళ్యాణ్ పడాల (Kalyan Padala) పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. దీంతో ఈ సీజన్ విన్నర్ ఎవరు అనే ప్రశ్నకు సమాధానం చెప్పడం మరింత కష్టంగా మారింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో జరుగుతున్న చర్చలు, ఫ్యాన్ పోల్స్ చూస్తే ఈ ముగ్గురి మధ్య గట్టి పోటీ నడుస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.
ఈ సీజన్‌లో కామనర్స్‌గా బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టి టాప్ 5 వరకు చేరుకోవడం డీమాన్ పవన్ (Demon Pawan), కళ్యాణ్ పడాలకు పెద్ద ప్లస్ అయింది. ముఖ్యంగా టాస్క్‌లలో వారి ప్రదర్శన, ఆటతీరు, నిజాయితీ గేమ్ ప్లాన్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. కళ్యాణ్ పడాల తన మాటతీరు, స్పష్టమైన స్టాండ్‌తో హౌస్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అదే కారణంగా అతడికి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పడిందని చెప్పాలి.
మరోవైపు, ఫ్యాన్ ఫాలోయింగ్ విషయంలో తనూజ (Tanuja) ఇప్పటికీ ముందంజలో ఉందనే అభిప్రాయం ఉంది. సీరియల్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఆమెకు మొదటి వారంనుంచే బలమైన ఓటింగ్ సపోర్ట్ లభించింది. గత కొన్ని వారాల వరకూ ఆమె టైటిల్ రేస్‌లో టాప్‌లో కొనసాగడం కూడా దీనికే నిదర్శనం. అయితే ఫినాలే సమీపిస్తున్న కొద్దీ ఓటింగ్ లెక్కలు క్షణక్షణానికి మారుతున్నాయని సమాచారం.
తాజా లీకుల ప్రకారం, ఈ సీజన్ టైటిల్ కోసం తనూజ, కళ్యాణ్ పడాల, ఇమ్మాన్యుయేల్ మధ్య త్రిముఖ పోటీ (Triangle Fight) నడుస్తోంది. ముఖ్యంగా తనూజ, కళ్యాణ్ మధ్య ఓటింగ్ డిఫరెన్స్ చాలా తక్కువగా ఉందని తెలుస్తోంది. ఇటు తనూజ ఫ్యాన్స్, అటు కళ్యాణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో భారీ క్యాంపెయిన్లు నిర్వహిస్తూ ఓటింగ్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ‘తగ్గేదేలే’ అన్నట్టుగా ఫ్యాన్ వార్ నడుస్తుండటం గమనార్హం.
ఇక ఇమ్మాన్యుయేల్ (Emmanuel) విషయంలో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. బుధవారం ప్రసారమైన బిగ్ బాస్ ఎపిసోడ్‌లో అతడి జర్నీ వీడియో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. మొదటి రోజు నుంచే తన కామెడీ టైమింగ్, సహజమైన మాటలతో హౌస్‌ను ఎంటర్‌టైన్ చేసిన ఇమ్మూ, తన ప్రయాణాన్ని ఎమోషనల్‌గా చూపించడంతో పెద్ద ఎత్తున సానుభూతి, మద్దతు లభిస్తున్నట్లు సమాచారం. దీంతో ఓటింగ్‌లో అతడు అనూహ్యంగా దూసుకొచ్చాడని సోషల్ మీడియా లెక్కలు చెబుతున్నాయి.
ముందుగా టైటిల్ రేస్‌లో వెనుకబడ్డట్లు కనిపించిన ఇమ్మాన్యుయేల్ ఇప్పుడు టాప్ కంటెండర్‌గా మారడం ఈ సీజన్‌లోనే అతిపెద్ద ట్విస్ట్‌గా చెప్పుకోవచ్చు. బిగ్ బాస్ షో (Bigg Boss Show) చరిత్రలో ఇలాంటి చివరి నిమిషం మార్పులు చాలా అరుదుగా జరుగుతుంటాయి. అదే ఇప్పుడు సీజన్ 9లో జరుగుతోందని ప్రేక్షకులు భావిస్తున్నారు.
మొత్తానికి, తనూజ (Tanuja), కళ్యాణ్ పడాల (Kalyan Padala), ఇమ్మాన్యుయేల్ (Emmanuel) మధ్య గట్టి పోటీ నడుస్తుండటంతో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 విన్నర్ ఎవరు అనే ప్రశ్నకు ఇంకా స్పష్టత రాలేదు. గ్రాండ్ ఫినాలే రోజు వరకూ ఓటింగ్‌లో ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకుంటాయో, చివరకు టైటిల్ ఎవరి ఖాతాలో పడుతుందో చూడాల్సిందే. ఈ ఉత్కంఠే బిగ్ బాస్ సీజన్ 9ను మరింత ఆసక్తికరంగా మార్చుతోంది.

Comments