Article Body
భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన ‘ఛాంపియన్’
‘పెళ్లి సందడి’ తర్వాత భారీ గ్యాప్ తీసుకున్న హీరో రోషన్ (Roshan) తాజాగా ‘ఛాంపియన్’ (Champion Movie) సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. టీజర్, ట్రైలర్ చూసినప్పటి నుంచే ఈ సినిమా రిచ్ ప్రొడక్షన్ విలువ్స్‌తో, డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిందన్న అభిప్రాయం ఏర్పడింది. ముఖ్యంగా విడుదలకు ముందే ‘గిర్రా గిర్రా బొంగరానివే’ పాట పెద్ద హిట్ అవ్వడంతో సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. మూవీ టీమ్ కూడా ప్రమోషన్స్‌ను గట్టిగానే చేయడంతో, థియేటర్లలో తప్పకుండా చూడాల్సిన సినిమా అనే ఫీలింగ్ ఒక సెక్షన్ ఆడియన్స్‌లో ఫిక్స్ అయ్యింది.
ఫస్ట్ హాఫ్‌పై ట్విట్టర్ నుంచి పాజిటివ్ టాక్
సినిమా విడుదలైన తర్వాత ట్విట్టర్ (Twitter)లో మొదట వచ్చిన రియాక్షన్స్ ప్రకారం ఫస్ట్ హాఫ్ టెక్నికల్‌గా స్ట్రాంగ్‌గా ఉందని అంటున్నారు. హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌ను చాలా డీసెంట్‌గా సెటప్ చేశారని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే స్క్రీన్‌ప్లే మొదటి భాగంలో కొంచెం ఫ్లాట్‌గా సాగుతుందని, హీరోయిన్ ఎంట్రీ తర్వాత నుంచి ఇంటర్వెల్ వరకు మాత్రం ఎంగేజింగ్‌గా మారుతుందని ట్విట్టర్ ఆడియన్స్ చెబుతున్నారు. మొత్తం ఫస్ట్ హాఫ్‌కు ‘గిర్రా గిర్రా బొంగరానివే’ సాంగ్ హైలైట్‌గా నిలిచిందని చాలా మంది ట్వీట్ చేస్తున్నారు.
సెకండ్ హాఫ్‌లో తగ్గిన ఎంగేజ్మెంట్
సెకండ్ హాఫ్‌కు వచ్చేసరికి సినిమా బాగా పికప్ అవుతుందని ఆశించిన ప్రేక్షకులకు నిరాశే ఎదురైందని ట్విట్టర్ టాక్. ఇక్కడ కూడా డైరెక్టర్ ఫ్లాట్ స్క్రీన్‌ప్లేతో ఆడియన్స్‌ను పూర్తిగా ఎంగేజ్ చేయలేకపోయాడని కామెంట్స్ వినిపిస్తున్నాయి. కథ, సెటప్‌లో బలమైన ఎమోషన్స్ పండించే అవకాశం ఉన్నా, వాటిని పూర్తిగా ఉపయోగించుకోలేదని అభిప్రాయం. ముఖ్యంగా క్లైమాక్స్ దాకా సినిమా ఆశించిన స్థాయిలో ఎమోషనల్ హై ఇవ్వలేదని పలువురు ట్విట్టర్ యూజర్లు రాస్తున్నారు.
డైరెక్షన్‌పై విమర్శలు – నటనపై ప్రశంసలు
డైరెక్టర్ టేకింగ్‌లో అనుభవం లేమి స్పష్టంగా కనిపించిందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. కొత్తగా చూపించాలనే ప్రయత్నం కనిపించినా, రైటింగ్‌లో తడబాటు ఉన్నట్టుగా అనిపించిందని కామెంట్స్ వస్తున్నాయి. ఇదే స్టోరీని ఇంకొక అనుభవం ఉన్న డైరెక్టర్ హ్యాండిల్ చేసి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని కొందరు ట్వీట్ చేశారు. నటన విషయానికి వస్తే రోషన్ నటన డీసెంట్‌గా ఉందని, అయితే హీరోయిన్ అనశ్వర రాజన్ (Anaswara Rajan) పెర్ఫార్మెన్స్ మాత్రం వేరే లెవెల్‌లో ఉందని ఎక్కువ మంది ప్రశంసిస్తున్నారు.
ఓవరాల్‌గా ట్విట్టర్ ఫైనల్ వర్డిక్ట్
మొత్తం మీద ట్విట్టర్ ఆడియన్స్ ఇచ్చిన ఓవరాల్ టాక్ ప్రకారం ‘ఛాంపియన్’ బిలో యావరేజ్ నుంచి యావరేజ్ రేంజ్ సినిమా అని అభిప్రాయం వ్యక్తమవుతోంది. కమర్షియల్‌గా పెద్ద సక్సెస్ అవ్వడం కష్టం అనే అంచనాలు కూడా కనిపిస్తున్నాయి. భారీ బడ్జెట్, మంచి కాన్సెప్ట్ ఉన్నప్పటికీ, ఎగ్జిక్యూషన్ లోపాల వల్ల సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయిందని ట్విట్టర్ రివ్యూలు చెబుతున్నాయి. రాబోయే రోజుల్లో వర్డ్ ఆఫ్ మౌత్ ఎంతవరకు సినిమాకు కలిసి వస్తుందన్నదే అసలు పరీక్షగా మారింది.
మొత్తం గా చెప్పాలంటే
‘ఛాంపియన్’పై ట్విట్టర్‌లో మిక్స్‌డ్ టాక్ కొనసాగుతోంది. కొన్ని బలమైన అంశాలు ఉన్నా, మొత్తం సినిమా ఆడియన్స్ అంచనాలను పూర్తిగా అందుకోలేదన్న అభిప్రాయం స్పష్టంగా కనిపిస్తోంది.
#Champion Review: Flat and Forgettable#Champion gets the visuals right, but struggles throughout with weak direction and the writing fails to generate interest. The Bhiaranpally bravery and emotional moments never quite land. Roshan looks too young to fill such big shoes,…
— M9 NEWS (@M9News_) December 25, 2025
A good first half. The setup, lead pair chemistry, background score everything felt perfect and worked really well so far. The ‘Gira Gira’ song looked absolutely beautiful on screen. #Champion https://t.co/QhREKe6nJw
— Filmy Hub (@FilmyHubNews) December 25, 2025

Comments