Article Body
బంగారం (Gold) మరియు వెండి (Silver) ధరల దూకుడు ఏమాత్రం తగ్గడం లేదు. రోజురోజుకు అకాశమే హద్దుగా పెరుగుతూ, సరికొత్త రికార్డులు నమోదు చేస్తున్నాయి. తాజాగా గురువారం మరోసారి బంగారం, వెండి ధరలు దిమ్మతిరిగే షాక్ ఇచ్చాయి. ముఖ్యంగా వెండి ధర (Silver Price) రాకెట్ వేగంతో దూసుకెళ్లడంతో కిలో వెండి రూ. రెండున్నర లక్షలకు చేరువవుతోందన్న అంచనాలు వినిపిస్తున్నాయి.
గురువారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం, 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర (24 Carat Gold Price)పై రూ.330 పెరిగింది. అదే సమయంలో 22 క్యారట్ల బంగారం ధర (22 carat gold price)పై రూ.300 పెరుగుదల నమోదైంది. దేశీయ మార్కెట్‌తో పాటు అంతర్జాతీయ మార్కెట్ (International Market)లో కూడా గోల్డ్ రేటు పెరిగింది. ఔన్సు గోల్డ్ (Gold Ounce Price)పై ఏకంగా 30 డాలర్లు పెరగడంతో అక్కడ ఔన్సు గోల్డ్ ధర 4,331 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
మరోవైపు వెండి ధర (Silver Rate) మాత్రం మరింత వేగంగా పెరుగుతోంది. బుధవారం కిలో వెండిపై రూ.11,000 పెరగ్గా, ఇవాళ గురువారం మరో రూ.2,000 పెరిగింది. దీంతో దేశీయ మార్కెట్లో కిలో వెండి ధర రూ.2,24,000 వద్దకు చేరుకుంది. ఇటీవలి కాలంలో వెండి ధరలు ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి కావడంతో పెట్టుబడిదారులు, వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ (Telugu States)లోని ప్రధాన నగరాల్లో ఇవాళ బంగారం ధరలు గణనీయంగా పెరిగాయి. హైదరాబాద్ (Hyderabad), విజయవాడ (Vijayawada), విశాఖపట్టణం (Visakhapatnam) నగరాలతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. ఈ మూడు నగరాల్లో 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.1,23,600గా నమోదైంది. అదే సమయంలో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,34,840కు చేరింది.
దేశంలోని ఇతర ప్రధాన నగరాల విషయానికి వస్తే, దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.1,23,750గా ఉంది. ఇక 24 క్యారట్ల బంగారం ధర రూ.1,34,990కు చేరుకుంది. ముంబై (Mumbai), బెంగళూరు (Bengaluru), చెన్నై (Chennai) వంటి మెట్రో నగరాల్లో 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.1,23,600గా ఉండగా, 24 క్యారట్ల ధర రూ.1,34,840గా కొనసాగుతోంది.
వెండి ధరల విషయానికి వస్తే, తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ భారీ పెరుగుదల కనిపించింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం నగరాల్లో కిలో వెండిపై రూ.2,000 పెరగడంతో ధర రూ.2,24,000 వద్దకు చేరింది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాల్లో మాత్రం కిలో వెండి ధర రూ.2,11,000 వద్ద కొనసాగుతోంది. ఇక చెన్నైలో వెండి ధర (Chennai Silver Price) మాత్రం తెలుగు రాష్ట్రాల స్థాయిలోనే ఉండి కిలో రూ.2,24,000గా నమోదైంది.
మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, అంతర్జాతీయ పరిస్థితులు, డాలర్ మారకం విలువ (Dollar Rate), జియోపాలిటికల్ టెన్షన్స్ (Geopolitical Tensions) వంటి అంశాలే బంగారం, వెండి ధరలు పెరగడానికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. రానున్న రోజుల్లో కూడా ఈ ధరలు ఇదే విధంగా కొనసాగవచ్చని అంచనా వేస్తున్నారు. దీంతో బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునే వారు జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

Comments