Article Body
కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో iBOMMA… ఇమ్మడి రవి అనే పేరు వినిపిస్తూనే ఉంది. ప్రతి ప్లాట్‌ఫారమ్‌లో ఆయన గురించి రకాలుగా చర్చలు, వివాదాలు, విమర్శలు, అప్రతిష్టలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పెరిగిన హైప్, ఇమ్మడి రవి జీవితంలో దాగి ఉన్న అనేక రహస్యాల వల్ల ఇప్పుడు ఒక నిర్మాణ సంస్థ ఆయన జీవితాన్ని వెండితెరపైకి తీసుకురావాలని నిర్ణయించింది. ‘తేజ్ క్రియేటివ్ వర్క్స్’ అధికారికంగా ప్రకటించినట్లుగా ఇది కేవలం బయోపిక్ కాదు — రవి ఎదిగిన తీరు, పడిపోయిన సందర్భాలు, ఆయన చుట్టూ ఉన్న చీకటి ప్రపంచం అన్నీ బయటపెట్టే సినిమా కానుంది.
సోషల్ మీడియాలో సంచలనం – ఎవరు ఈ ఇమ్మడి రవి?
ఒకప్పుడు తెలుగు ఇంటర్నెట్ సర్కిల్స్‌లో iBOMMA అనే నామం ఘోషించేది. అదే సమయంలో ఇమ్మడి రవి అనే వ్యక్తి గురించి సోషల్ మీడియాలో కథలు, ఆరోపణలు, ఫ్యాన్ బేస్ విభేదాలు పెద్ద స్థాయిలో చర్చకు వచ్చాయి. గత రెండు వారాలుగా అయితే ఏ సోషల్ మీడియాను తెరిచినా ఆయన పేరే కనిపిస్తోంది. రకరకాల వైపుల నుంచి కథలు రావడంతో రవి ఎవరు.? ఎందుకు ఈ స్థాయిలో వివాదాలు.? అనే ప్రశ్నలు గుప్పుమన్నాయి.
జీవితంపై సినిమా – తీసేందుకు ముందుకొచ్చింది ‘తేజ్ క్రియేటివ్ వర్క్స్’?
ఈ నేపథ్యంలో ‘తేజ్ క్రియేటివ్ వర్క్స్’ ప్రకటించిన ప్రకటన షాక్ ఇచ్చింది. “ఇమ్మడి రవి జీవితంలో జరిగిన వాస్తవాలు, ఆయన చేసిన పోరాటం, ఎదుర్కొన్న వెన్నుపోట్ల గురించి నిజ జీవిత ఆధారాలతో సినిమా తీయబోతున్నాం” అని వారు స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వినిపిస్తున్న పదే పదే కథలు, పోస్టులు, ప్రతికూల ప్రచారం—అన్ని ఈ బియోపిక్‌లో స్పష్టమైన రూపం దాల్చబోతున్నాయి. రవి మరియు అతని టీమ్ గురించి బయటికి రాని చీకటి అంశాలు కూడా సినిమాలో ఉంటాయని చెప్పడం మరింత ఆసక్తి రేపుతోంది.
కథలోని రహస్యాలు – ఎవరు, ఎందుకు వెన్నుపోటు.?
ఇమ్మడి రవి చుట్టూ ఎన్నో రూమర్లు ఉన్నాయి. అతనిపై కేసులు, వ్యక్తిగత శత్రుత్వాలు, వ్యాపార సంబంధిత వివాదాలు, టీమ్‌లో జరిగిన అంతర్గత సంఘర్షణలు—ఇవి అన్నీ సోషల్ మీడియాలో ఎప్పుడూ వినిపిస్తూనే ఉన్నాయి. సినిమా వర్షన్ వీటినన్నిటిని ఎలా చూపిస్తుందో చూడాలి. ముఖ్యంగా “వెన్నుపోటు” అన్న పదం ఇప్పటికే ట్రెండింగ్‌లో ఉంది. ఈ కథలో ఎవరెవరూ బయటపడతారో, ఎవరి పాత్రలు నిజ జీవిత వ్యక్తులను పోలినవో అన్న ఆసక్తి ప్రేక్షకుల్లో ఎక్కువగా ఉంది.
రవికి ఇది ప్లస్‌నా.? లేక మరింత వివాదమా.?
ఒక వ్యక్తి జీవితాన్ని సినిమా రూపంలో చూపించడం పెద్ద హైప్ ఇవ్వగలిగినంతే, అదే సమయంలో భారీ సమస్యలు కూడా తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది. రవిని సపోర్ట్ చేసే వారి కోసం ఇది పెద్ద గర్వకారణం. కానీ ఆయనను వ్యతిరేకించే వర్గాల కోసం మాత్రం ఇది తుపాకీకి కొత్త గుళ్లే. సినిమా రూపంలో ఇవన్నీ బయటపడుతుండటం వల్ల మరిన్ని వివాదాలు రేపే అవకాశం ఉన్నట్లు పరిశ్రమలో టాక్ నడుస్తోంది. ఈ మూవీ అనౌన్స్‌మెంట్‌తోనే SMలో ఇప్పటికే వాదనలు మళ్లీ వేడెక్కాయి.
ఎవరు హీరో.? ఎప్పుడు మొదలు.? టాలీవుడ్‌లో కుతూహలం పెరిగింది.
సినిమాకి హీరోగా ఎవరు నటిస్తారు.? రవిని పోలిన కొత్త ఫేస్ తీసుకుంటారా.? లేక ప్రముఖ నటుడిని ఎంపిక చేస్తారా.? వంటి ప్రశ్నలపై ప్రస్తుతం టాలీవుడ్‌లో ఊహాగానాల వర్షం కురుస్తోంది. స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే స్టార్ట్ అయిందని, కాస్టింగ్ దశలో ఉన్నారని సమాచారం. వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉందని పరిశ్రమలో చర్చ. ఒక సాధారణ వ్యక్తి పేరు ఇలా SMలో హడావుడి సృష్టించడం, దాని మీదే సినిమా రావడం—ఇది కూడా ఒక అరుదైన కథే.

Comments