Article Body
భారతదేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు కేవలం సంపాదించడానికే కాదు, సమాజానికి తిరిగి ఇవ్వడంలో కూడా ముందుంటున్నారు. విద్య, ఆరోగ్యం, సామాజిక అభివృద్ధి వంటి రంగాల్లో వీరి విరాళాలు ప్రతీ ఏడాది పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా The EdelGive Hurun India Philanthropy List 2025 విడుదల కావడంతో, దేశంలోని ధనవంతుల దాతృత్వ గాథ మరోసారి వెలుగులోకి వచ్చింది.
ఏం చెబుతోంది హురూన్ ఇండియా ఫిలాంత్రపీ లిస్ట్ 2025?
2024 ఏప్రిల్ 1 నుంచి 2025 మార్చి 31 వరకు, మొత్తం 191 మంది భారత బిలియనీర్లు కలిపి రూ.10,380 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఇది మూడేళ్ల కిందటితో పోలిస్తే 85 శాతం వృద్ధి. వీరిలో కొందరు నేరుగా డబ్బు రూపంలో విరాళం ఇస్తే, మరికొందరు సామాజిక కార్యక్రమాలు, ఫౌండేషన్ల ద్వారా సహాయం అందించారు.
మొత్తం విరాళాల్లో ఎడ్యుకేషన్ సెక్టార్ (విద్య) కు వచ్చిన విరాళం అత్యధికం కాగా, తర్వాతి స్థానాల్లో హెల్త్‌కేర్ (ఆరోగ్య సంరక్షణ) మరియు సోషియల్ డెవలప్‌మెంట్ (సామాజిక అభివృద్ధి) ఉన్నాయి.
టాప్ 3 డోనార్స్ — శివ్ నాడార్, అంబానీ, బజాజ్ ఫ్యామిలీ
ఈ జాబితాలో వరుసగా నాలుగోసారి శివ్ నాడార్ & ఫ్యామిలీ టాప్ స్థానంలో నిలిచారు. వారు మొత్తం రూ.2,708 కోట్లు డొనేట్ చేశారు — అంటే రోజుకు సగటుగా రూ.7.4 కోట్లు! గత ఏడాదితో పోలిస్తే 26% ఎక్కువ.
రెండో స్థానంలో ముకేశ్ అంబానీ ఉన్నారు. ఆయన ఈ ఏడాది రూ.626 కోట్లు విరాళంగా ఇచ్చారు — ఇది గత ఏడాదితో పోలిస్తే 54% వృద్ధి.
మూడో స్థానంలో బజాజ్ ఫ్యామిలీ రూ.446 కోట్ల విరాళంతో నిలిచింది.
ఎవరెవరికి ఎంత ఎంత ఎక్కువగా ఇచ్చారు?
-
శివ్ నాడార్ ఫ్యామిలీ: ఈ ఏడాది మాత్రమే రూ.555 కోట్లు అదనంగా డొనేట్ చేశారు.
-
ముకేశ్ అంబానీ: రూ.219 కోట్లు ఎక్కువగా ఇచ్చారు.
-
హిందుజా ఫ్యామిలీ: రూ.179 కోట్లు పెంచి విరాళం అందించింది.
ఎక్కడికి ఎక్కువగా డొనేషన్స్ వెళ్లాయి?
-
Education (విద్య): రూ.2,392 కోట్లు (మొత్తం 107 మంది విరాళం ఇచ్చారు)
-
Healthcare (ఆరోగ్య సంరక్షణ): రూ.971 కోట్లు (ముఖ్యంగా హిందుజా ఫ్యామిలీ విరాళం)
-
Environment & Sustainability: రూ.171 కోట్లు (అంబానీ ఫ్యామిలీ)
-
Arts, Culture & Heritage: రూ.309 కోట్లు (నంద్‌లాల్ రుంగ్తా ఫ్యామిలీ)
-
Rural Development: రూ.301 కోట్లు (హిందుజా ఫ్యామిలీ ప్రధానంగా)
-
Research & Development: రూ.214 కోట్లు (నందన్ నీలేకని రూ.171 కోట్లు)
-
Sports Development: రూ.158 కోట్లు (అంబానీ ఫ్యామిలీ రూ.127 కోట్లు)
మహిళల విరాళాల్లో రోహిణీ నీలేకని ముందంజలో
ఈ లిస్ట్‌లో మొత్తం 24 మంది మహిళా ఫిలాంత్రపిస్టులు ఉన్నారు. వీరిలో రోహిణీ నీలేకని రూ.204 కోట్ల విరాళంతో టాప్‌లో నిలిచారు.
గత మూడు సంవత్సరాల్లో టాప్ 25 దాతలు కలిపి రూ.50,000 కోట్లకు పైగా డొనేట్ చేశారు.
యంగెస్ట్ ఫిలాంత్రపిస్టుగా జెరోధా నిఖిల్ కామత్
జెరోధా కో-ఫౌండర్ నిఖిల్ కామత్ (39) వరుసగా నాలుగోసారి యంగెస్ట్ ఫిలాంత్రపిస్టుగా నిలిచారు. యువ పారిశ్రామికవేత్తలలో సామాజిక బాధ్యత పట్ల ఉన్న ఆసక్తికి ఇది చిహ్నం.
భారత దాతృత్వ శక్తి – ప్రపంచానికి ఆదర్శం
మొత్తం మీద, ఈ లిస్ట్ భారత బిలియనీర్లలో ఉన్న మానవతా దృక్పథం, సామాజిక బాధ్యతా భావం కు అద్దం పడింది. వ్యాపార విజయం కంటే కూడా, సమాజానికి తిరిగి ఇవ్వడమే నిజమైన సక్సెస్ అని వారు చూపిస్తున్నారు.

Comments