Article Body
అక్కినేని కుటుంబం (Akkineni Family) గురించి ఏ చిన్న వార్త వచ్చినా అది దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతుందన్న విషయం తెలిసిందే. అలాంటి నేపథ్యంలో అక్కినేని అఖిల్ (Akkineni Akhil) ఈ ఏడాది జూన్ నెలలో జైనబ్ (Zainab) తో వివాహం చేసుకున్న విషయం అప్పట్లో ఇండియా మొత్తం చర్చకు దారి తీసింది. వయస్సులో జైనబ్ అఖిల్ కంటే కొద్దిగా పెద్దదైనా, ఇద్దరి మనసులు కలవడం, కుటుంబ సభ్యుల పూర్తి అంగీకారం ఉండటంతో ఈ వివాహం ఘనంగా జరిగింది. ఈ పెళ్లి అక్కినేని ఫ్యామిలీలో కొత్త అధ్యాయానికి నాంది పలికినట్టుగా అభిమానులు భావించారు.
అయితే గత కొంతకాలంగా సోషల్ మీడియా (Social Media) లో అక్కినేని కుటుంబానికి సంబంధించిన పలు రూమర్స్ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా నాగ చైతన్య (Naga Chaitanya) – శోభిత ధూళిపాళ (Sobhita Dhulipala) జంట త్వరలోనే ఒక బిడ్డకు జన్మనివ్వబోతున్నారని, అక్కినేని కుటుంబం మొత్తం ఈ శుభవార్తతో సంబరాలు చేసుకుంటోందని వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఈ ప్రచారంపై శోభిత టీమ్ అధికారికంగా స్పందిస్తూ, ఇందులో ఎలాంటి నిజం లేదని ఇన్‌స్టాగ్రామ్ (Instagram) ద్వారా స్పష్టం చేసింది. దీంతో ఆ వార్తలకు కొంతవరకు ఫుల్ స్టాప్ పడింది.
ఇక ఇదే తరహాలో అఖిల్ – జైనబ్ (Akhil – Zainab) జంట గురించి కూడా గత కొన్ని రోజులుగా గుడ్ న్యూస్ రూమర్స్ వినిపించాయి. ఈ నేపథ్యంలో నేడు జరిగిన ఒక హెల్త్ ఈవెంట్ (Health Event) లో ముఖ్య అతిథిగా పాల్గొన్న నాగార్జున (Akkineni Nagarjuna) మీడియాతో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా ఒక రిపోర్టర్, “మీరు త్వరలోనే తండ్రి నుంచి తాతగా ప్రమోట్ అవబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉంది?” అని ప్రశ్నించారు.
దీనికి నాగార్జున చిరునవ్వుతో స్పందిస్తూ, “సరైన సమయం వచ్చినప్పుడు నేనే అధికారికంగా చెప్తాను” అని అన్నారు. ఈ సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. ఎందుకంటే ఆయన ఈ వార్తలను పూర్తిగా ఖండించలేదు. దీంతో కచ్చితంగా తన ఇద్దరు కొడుకుల్లో ఎవరో ఒకరు శుభవార్త వినిపించబోతున్నారనే అర్థం వస్తోందని అభిమానులు భావిస్తున్నారు.
అయితే ఈ రూమర్స్‌లో శోభిత ధూళిపాళ (Sobhita Dhulipala) పేరు ఉండే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఆమె ప్రస్తుతం సోషల్ మీడియాలో రెగ్యులర్‌గా యాక్టివ్‌గా ఉండటం, షూటింగ్స్‌లో పాల్గొనడం చూస్తే, గర్భం దాల్చినట్టు ఎలాంటి సూచనలు కనిపించడం లేదని ఫ్యాన్స్ అంటున్నారు. దీంతో శోభిత ఈ లిస్టులో నుంచి దాదాపు బయటకు వెళ్లినట్టే.
అలా అయితే మిగిలేది అఖిల్ – జైనబ్ జంటే అని అభిమానులు అనుకుంటున్నారు. పెళ్లైన కొద్ది నెలలకే గుడ్ న్యూస్ రావడం అక్కినేని ఫ్యాన్స్‌కు డబుల్ సెలబ్రేషన్ అవుతుందని వారు కామెంట్లు పెడుతున్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా నాగార్జున స్వయంగా ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తాడా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఇదిలా ఉండగా అక్కినేని అఖిల్ (Akkineni Akhil) కెరీర్ విషయానికి వస్తే, ప్రస్తుతం ‘లెనిన్’ (Lenin) అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎన్నేళ్లు అవుతున్నా సరైన సాలిడ్ హిట్ లేకపోవడం వల్ల అక్కినేని అభిమానుల్లో అతనిపై అసంతృప్తి ఉంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఆయన గత చిత్రం ‘ఏజెంట్’ (Agent) కమర్షియల్‌గా భారీ డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో ‘లెనిన్’ సినిమాతో అయినా తప్పకుండా హిట్ కొట్టాలనే కసితో అఖిల్ ఉన్నాడు.
పెళ్లి తర్వాత అఖిల్ కెరీర్‌లో ఈ సినిమా ఏమైనా మార్పులు తీసుకొస్తుందా, అదే సమయంలో కుటుంబంలో శుభవార్త నిజమవుతుందా అనే రెండు అంశాలు ఇప్పుడు అక్కినేని ఫ్యాన్స్‌లో ఆసక్తిని పెంచుతున్నాయి. చూడాలి మరి రాబోయే రోజుల్లో నాగార్జున కుటుంబం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వస్తుందో.

Comments