Article Body
టాలీవుడ్‌లో గత నెల విడుదలైన చిత్రాల్లో, అత్యంత చర్చలకు కారణమైన సినిమా ‘కె–ర్యాంప్’. కిరణ్ అబ్బవరం నటించిన ఈ యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ థియేటర్లలో భారీగా దూసుకెళ్లి, కలెక్షన్లతో బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఇప్పుడు ఇదే సినిమా ఓటీటీలో విడుదలై ప్రేక్షకుల్లో మరింత ఉత్సాహాన్ని రేపుతోంది. యూత్ ను బాగా ఆకట్టుకున్న ఈ సినిమా, స్ట్రీమింగ్ ప్రారంభమైన తొలి గంటల నుంచే మంచి వ్యూయర్‌షిప్ అందుకుంటోంది.
థియేటర్లలో విడుదలైన తొలి రోజే ‘కే–ర్యాంప్’కి నెగటివ్ టాక్ వచ్చినా, రెండో రోజు నుంచే పరిస్థితి మారిపోయింది. సినిమాలో ఉన్న బూతులు కొంత మంది విమర్శించినా, కంటెంట్‌లో ఉన్న ఎనర్జీ, కామెడీ స్కోర్లు, రాపిడ్ స్క్రీన్‌ప్లే ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ప్రత్యేకంగా కిరణ్ అబ్బవరం చేసిన “ఇదేమిటమ్మా మాయా మాయా మైకం” డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ అయి, సినిమా యూత్ లో విపరీతమైన హైప్ తెచ్చింది.
ఈ సినిమా విజయానికి ప్రధాన కారణాల్లో ఒకటి కిరణ్ అబ్బవరం ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్. యుక్తి తరేజా హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో నరేష్ వీకే, సాయి కుమార్, కామ్నా జెఠ్మలానీ కీలక పాత్రల్లో మెరిశారు. డైరెక్టర్ జైన్స్ నాని కథను వేగంగా నడిపిస్తూ, యూత్ కోరుకునే కామెడీ, మాస్ అంశాలను పకడ్బందీగా మిక్స్ చేశారు. అందుకే దీపావళి రేస్‌లో హిట్ సినిమాగా నిలబడగలిగింది.
ఇప్పుడు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఈ మూవీ, నవంబర్ 15 అర్ధరాత్రి నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది. థియేటర్లలో మిస్ అయినవారికి ఇది గోల్డెన్ ఛాన్స్. ముఖ్యంగా యూత్ కు ఇది సరదా, కామెడీతో నిండిన ప్యాకేజ్. ఇప్పటికే ఐఎమ్‌డీబీ లో 8.2/10 రేటింగ్ దక్కడం ఈ మూవీకి ఉన్న క్రేజ్‌కు నిదర్శనం.
మొత్తానికి, 'కె–ర్యాంప్' సినిమా థియేటర్ల తర్వాత ఓటీటీలో కూడా అదే జోష్‌ను కొనసాగిస్తోంది. కిరణ్ అబ్బవరం ఫ్యాన్స్, యూత్ ఎనర్జిటిక్ కామెడీ మూవీస్ ఇష్టపడే ప్రేక్షకులు తప్పకుండా చూడాల్సిన మూవీగా నిలిచింది. ఇప్పుడు అందరూ ఆహా ఓటీటీలో ఈ సినిమాను ఎంజాయ్ చేస్తూ సోషల్ మీడియాలో మంచి రివ్యూలు ఇస్తున్నారు. మీరు ఇంకా చూడలేదా? ఐతే ఈ వీకెండ్ ఇది మీకు పర్ఫెక్ట్ ఎంటర్‌టైన్మెంట్.

Comments