Article Body
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అంటే సినిమాల్లో ఒక లుక్, రాజకీయాల్లో మరో లుక్ అన్నట్టుగా ఇప్పటి వరకు ప్రేక్షకులు చూస్తూ వచ్చారు. సినిమా షూటింగ్స్ సమయంలో స్టైలిష్‌గా, ట్రెండీగా కనిపించే ఆయన, రాజకీయంగా బిజీగా ఉన్నప్పుడు మాత్రం తెల్ల బట్టలు, పొడవాటి జుట్టు, గెడ్డంతో సింపుల్ లుక్‌లో దర్శనమిచ్చేవారు. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan)గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన పొలిటికల్ లుక్‌నే ఎక్కువగా చూశాం. కానీ ఈమధ్య కాలంలో పవన్ కళ్యాణ్ పూర్తిగా కొత్త హెయిర్ స్టైల్‌తో కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు.
గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ సైడ్ కట్టింగ్స్ చేయించుకుని, కొంచెం రఫ్ అండ్ రా స్టైల్‌లో కనిపించడం మొదలుపెట్టారు. ఈ లుక్ చూసినప్పుడు పాత బస్తీల్లో కనిపించే రౌడీ స్టైల్ గుర్తుకు వస్తోందని కొందరు ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. మొదట ఈ లుక్‌కు అలవాటు పడటానికి అభిమానులకు కొంత సమయం పట్టినా, మెల్లగా ఈ స్టైల్‌ను కూడా వారు అంగీకరించారు. పవన్ కళ్యాణ్ అంటే కొత్తదనం, సర్‌ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుందనే నమ్మకం అభిమానుల్లో ఎప్పటినుంచో ఉంది.
ఇటీవలే పవన్ కళ్యాణ్, ఓజీ మూవీ (OG Movie) డైరెక్టర్ సుజిత్ (Sujeeth)కు ఖరీదైన కారును బహుమతిగా ఇస్తూ కనిపించారు. ఆ సందర్భంలో పవన్ కళ్యాణ్ లుక్‌ను చూసిన ఫ్యాన్స్‌తో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ట్రేడ్‌మార్క్ హెయిర్ స్టైల్‌కు ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన జుట్టు స్టైల్ అంటేనే అభిమానులకు ఒక ఎమోషన్.
ప్రత్యేకంగా ఇటీవల విడుదలైన ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) సినిమాలోని ‘దేఖ్లేంగే సాలా’ పాటలో పవన్ కళ్యాణ్ జుట్టు గాలిలో ఎగురుతూ కనిపించిన సన్నివేశాలు అభిమానులను పిచ్చెక్కించాయి. చిన్నప్పటి నుంచి మనం చూసి పెరిగింది ఇలాంటి పవన్ కళ్యాణ్‌నే కదా అంటూ సోషల్ మీడియాలో ఎన్నో కామెంట్లు వచ్చాయి. అలాంటి ఇమేజ్ ఉన్న పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా పూర్తిగా భిన్నమైన గెటప్‌లో కనిపించడంతో, ఫ్యాన్స్‌లో మిశ్రమ స్పందన కనిపిస్తోంది.
మొట్టమొదటిసారి పవన్ కళ్యాణ్ కలలో కూడా ఊహించని ఈ సరికొత్త లుక్‌ను చూసి కొందరు అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏంటన్నా ఇలా తయారయ్యావ్, అసలు బాగాలేదు, దయచేసి మార్చేయ్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఇంకొందరు అయితే ఇది నిజంగా పవన్ కళ్యాణ్‌యేనా, గుర్తుపట్టడానికి కూడా సమయం పట్టిందని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఈ హెయిర్ స్టైల్ వెనుక అసలు కారణం ఏమిటన్నది ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఈ లుక్ తన కొత్త సినిమాకు సంబంధించినదని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అయితే అది ఏ సినిమా అనేది మాత్రం ఇంకా అధికారికంగా బయటకు రాలేదు. లోకేష్ కనకరాజ్ (Lokesh Kanagaraj)తో పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేయబోతున్నాడనే టాక్ చాలా రోజులుగా వినిపిస్తోంది. ఈ లుక్ అదే సినిమాకు సంబంధించినదేనా అనే సందేహాలు అభిమానుల్లో మొదలయ్యాయి.
లుక్ టెస్ట్ జరిగినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ఇదే స్టైల్‌ను మైంటైన్ చేస్తున్నాడా, లేక పూర్తిగా కొత్త పాత్ర కోసం ఈ మార్పు చేసుకున్నాడా అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. దీనిపై పవన్ కళ్యాణ్ స్వయంగా స్పందిస్తే తప్ప నిజం ఏంటన్నది తెలియదు. కానీ ఇంత కచ్చితంగా లుక్‌ను కొనసాగిస్తున్నాడంటే, ఇది ఖచ్చితంగా సినిమాకు సంబంధించినదే అని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు. పవన్ కళ్యాణ్ నుంచి మరోసారి సర్‌ప్రైజ్ ప్యాకేజ్ రెడీ అవుతోందన్న అంచనాలు ఇప్పుడు ఇండస్ట్రీలో జోరుగా వినిపిస్తున్నాయి.

Comments