Article Body
పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఒక్కో ప్రాజెక్ట్‌తో ఒక్కో కొత్త జానర్‌ను టచ్ చేస్తూ, తన మార్కెట్‌ను దేశ సరిహద్దులు దాటి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రభాస్ – సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న స్పిరిట్ (Spirit) సినిమాపై అంచనాలు రోజురోజుకీ ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచే ట్రేడ్ వర్గాల్లోనూ, ఫ్యాన్స్‌లోనూ భారీ హైప్ క్రియేట్ అయ్యింది.
అర్జున్ రెడ్డి (Arjun Reddy), కబీర్ సింగ్ (Kabir Singh), యానిమల్ (Animal) వంటి కాంట్రవర్సీతో పాటు బ్లాక్‌బస్టర్ సినిమాలు తెరకెక్కించిన సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తుండటంతో, స్పిరిట్ మూవీపై మొదటి నుంచే నెక్స్ట్ లెవెల్ క్యూరియాసిటీ నెలకొంది. తాజాగా స్పిరిట్ మూవీ కథ ఇదే అంటూ ఓ బజ్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ స్టోరీ ఏంటీ అన్నది ఇప్పుడు అభిమానుల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్‌గా త్రుప్తి దిమ్రి (Tripti Dimri) నటిస్తోంది. యానిమల్ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న త్రుప్తి, స్పిరిట్‌లో కూడా కీలక పాత్రలో కనిపించనుందని సమాచారం. ఆమె పాత్ర కథలో భావోద్వేగాల పరంగా బలమైన స్థానం కలిగి ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఇక ఇతర కీలక పాత్రల్లో వివేక్ ఒబెరాయ్ (Vivek Oberoi), ప్రకాష్ రాజ్ (Prakash Raj), కంచన నటిస్తున్నారని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ప్రకాష్ రాజ్ జైలర్ పాత్రలో కనిపించనున్నారని వినిపిస్తోంది. బాలీవుడ్ నటి కాజోల్ (Kajol) కూడా ఓ కీలక పాత్రలో నటిస్తోందన్న వార్తలు సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి.
ఇప్పటికే స్పిరిట్ డిజిటల్ రైట్స్‌కు సంబంధించిన వార్తలు ఇండస్ట్రీలో సంచలనం సృష్టించాయి. ఈ మూవీ డిజిటల్ హక్కులు ఏకంగా రూ.160 కోట్లకు అమ్ముడయ్యాయని సమాచారం. ఇది ప్రభాస్ మార్కెట్ రేంజ్‌కు మరో బలమైన నిదర్శనంగా ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. బాహుబలి (Baahubali) తర్వాత ప్రభాస్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో మరోసారి రుజువైందని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇక ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, స్పిరిట్ సినిమాలో ప్రభాస్ తన కెరీర్‌లో తొలిసారి పవర్‌ఫుల్, రూత్‌లెస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ పాత్రను దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చాలా ఇంటెన్స్‌గా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. యాక్షన్‌తో పాటు స్ట్రాంగ్ ఎమోషన్స్, క్యారెక్టర్ డెప్త్ ఉన్న రోల్‌గా ప్రభాస్ పాత్ర ఉండనుందని సమాచారం. యానిమల్ తరహాలో క్యారెక్టర్ మైండ్‌సెట్‌ను లోతుగా చూపించే కథనంతో స్పిరిట్ రూపొందుతున్నట్లు టాక్.
లేటెస్ట్‌గా వైరల్ అవుతున్న బజ్ ప్రకారం, స్పిరిట్ స్టోరీ లైన్ ప్రధానంగా జాతీయ భద్రతా సమస్య చుట్టూ తిరుగుతుందట. దేశ భద్రతకు పొంచి ఉన్న భారీ ప్రమాదాన్ని ఎదుర్కొనే నిజాయితీ గల పోలీస్ అధికారిగా ప్రభాస్ కనిపించనున్నారని వినిపిస్తోంది. దేశాన్ని ప్రతినిధ్యం వహించేలా ఆయన క్యారెక్టర్ ఉంటుందని, అడుగడుగునా దేశ భద్రతను కాపాడే విధంగా కథ నడుస్తుందని సమాచారం. ఈ నేపథ్యంలో ప్రభాస్, విలన్ల మధ్య గూస్‌బంప్స్ ఇచ్చే యాక్షన్ సీన్స్‌ను దర్శకుడు భారీ స్థాయిలో డిజైన్ చేస్తున్నారని తెలుస్తోంది.
షూటింగ్ విషయానికి వస్తే, 2025 నవంబర్‌లో గ్రాండ్ ముహూర్తంతో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా, త్వరలో మెక్సికో (Mexico) లో భారీ షెడ్యూల్ ప్లాన్ చేసినట్లు సమాచారం. డిసెంబర్ మధ్యలో చిన్న బ్రేక్ తర్వాత షూటింగ్ మళ్లీ ఊపందుకోనుందని తెలుస్తోంది. సందీప్ రెడ్డి వంగా – ప్రభాస్ కాంబినేషన్‌తో రూపొందుతున్న ఈ మూవీ 2026 చివర్లో లేదా 2027లో థియేటర్లలో విడుదల కానుందని అంచనా. డార్లింగ్ ఫ్యాన్స్ మాత్రం ఇప్పటికే స్పిరిట్ కోసం కౌంట్‌డౌన్ మొదలుపెట్టేశారు.

Comments