Article Body
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక హీరో అంటే మరో హీరో ఫ్యాన్స్‌కు పడకపోవడం సాధారణంగా మారిపోయింది. ఏ హీరో సినిమా కంటెంట్ బయటకు వచ్చినా, అందులో ఎక్కడైనా తప్పు దొరుకుతుందా, ట్రోల్ చేయడానికి అవకాశం ఉందా అని యాంటీ ఫ్యాన్స్ (Anti Fans) ఎదురుచూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటీవల అఖండ 2 (Akhanda 2) రిలీజ్ తర్వాత సోషల్ మీడియాలో జరిగిన ట్రోలింగ్ అందరికీ తెలిసిందే. సినిమా బాగుందా లేదా అన్న దానికంటే, ట్రోల్స్ ఎంత వైరల్ అవుతున్నాయనే అంశమే ఇప్పుడు ఎక్కువగా చర్చకు వస్తోంది.
ఇప్పుడు అదే ట్రోలింగ్ వాతావరణంలోకి రాజా సాబ్ (The Raja Saab) సినిమా కూడా వచ్చి చేరింది. మారుతి (Maruthi) దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తున్న ఈ చిత్రం జనవరి 9న సంక్రాంతి స్పెషల్‌గా విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే మూవీ టీమ్ ప్రమోషన్స్ ప్రారంభించింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ప్రభాస్ లేకుండానే హీరోయిన్స్, దర్శకుడు మారుతి, ప్రొడ్యూసర్స్ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు. ఈ విషయం కూడా సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది.
రాజా సాబ్ ట్రైలర్ హారర్ కామెడీ (Horror Comedy) జానర్‌లో ఆకట్టుకున్నప్పటికీ, ఇటీవల విడుదలైన సింగిల్ మాత్రం ఆశించిన స్థాయిలో ట్రెండ్ కాలేదు. ఇది అభిమానులను కొంత నిరాశకు గురి చేసింది. ఇక తాజాగా విడుదలైన రెండో పాటపై అయితే సోషల్ మీడియాలో భీభత్సమైన ట్రోలింగ్ మొదలైంది. ముఖ్యంగా ఆ పాటలో ప్రభాస్ లుక్స్, డాన్స్ స్టెప్స్‌ను టార్గెట్ చేస్తూ మీమ్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రభాస్‌కు మోకాలి నొప్పి ఉందిరా అందుకే స్టెప్స్ సరిగా వేయలేకపోతున్నాడని కొందరు కామెంట్లు చేస్తుంటే, ఆయన తలపాగా గెటప్‌పై మరికొందరు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. ప్రభాస్ డాన్స్ చించేస్తాడు అనుకుంటే ఇంత డిజప్పాయింట్ చేశాడేమిటి అంటూ జరుగుతున్న కామెంట్స్ ప్రభాస్ ఫ్యాన్స్‌ను ఆందోళనకు గురి చేస్తున్నాయి. అయితే సినిమా పూర్తిగా రిలీజ్ అయిన తర్వాతే అసలు తీర్పు చెప్పాలని, ఇప్పుడే నెగటివిటీ స్ప్రెడ్ చేయడం సరైంది కాదని ప్రభాస్ అభిమానులు కౌంటర్లు ఇస్తున్నారు. సంక్రాంతి తర్వాత ఈ ట్రోల్స్ నిజమా కాదా అన్నది తేలిపోనుంది.

Comments