Article Body
తెలుగు, కన్నడ, పంజాబీ చిత్రాలతో పాటు బాలీవుడ్‌లో కూడా అవకాశాలు అందుకున్నప్పటికీ స్టార్ హీరోయిన్‌గా నిలదొక్కుకోలేకపోయిన అందాల తార శ్రద్ధా ఆర్య (Shraddha Arya). వెండితెరపై పెద్దగా అదృష్టం కలిసి రాకపోయినా, బుల్లితెరపై మాత్రం తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. ఒకప్పుడు సినిమాలతో కెరీర్ ప్రారంభించిన ఈ నటి, ఇప్పుడు టెలివిజన్ ఇండస్ట్రీలో టాప్ నటీమణుల్లో ఒకరిగా నిలిచింది.
శ్రద్ధా ఆర్య 2007లో టాలీవుడ్‌లో గొడవ (Godava Movie) సినిమాతో హీరోయిన్‌గా అరంగేట్రం చేసింది. తొలి చిత్రంతోనే గ్లామర్‌తో పాటు నటనలోనూ తన సత్తా చూపించిన ఈ భామ, ఆ సమయంలో యువతను ఆకట్టుకుంది. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలవడంతో పెద్ద బ్రేక్ మాత్రం రాలేదు. తెలుగులో కేవలం మూడు సినిమాల్లో మాత్రమే నటించిన ఆమె, ఆ తర్వాత హిందీ, కన్నడ భాషల్లోనూ అవకాశాలు ప్రయత్నించింది. అయినప్పటికీ ఎక్కడా కూడా శ్రద్ధా ఆర్యకు స్టార్ హీరోయిన్ స్థాయి గుర్తింపు దక్కలేదు.
వెండితెరపై ఆశించిన స్థాయిలో సక్సెస్ రాకపోయినా, బుల్లితెరపై మాత్రం శ్రద్ధా ఆర్య కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. తుమ్‌హారి పాఖి (Tumhari Paakhi), కుండలి భాగ్య (Kundali Bhagya), డ్రీమ్ గర్ల్ (Dream Girl Serial) వంటి హిట్ సీరియల్స్‌లో కీలక పాత్రలు పోషించి ప్రేక్షకుల మన్ననలు పొందింది. ముఖ్యంగా కుండలి భాగ్య సీరియల్ ఆమెకు దేశవ్యాప్తంగా విపరీతమైన పాపులారిటీని తెచ్చిపెట్టింది. టీవీ ప్రేక్షకులకు ఆమె ముఖం ఇంట్లో మనిషిలా మారిపోయింది.
ఇక శ్రద్ధా ఆర్య గురించి మరో ఆసక్తికర విషయం ఏంటంటే, ఆమె టీవీ సీరియల్స్‌లో ఏకంగా పది సార్లు పెళ్లి సీన్స్‌లో నటించడం. ఇది నిజ జీవితంలో కాదు, పూర్తిగా స్క్రీన్‌పై మాత్రమే. రకరకాల సీరియల్స్‌లో పదే పదే వధువుగా కనిపించి ఆమె ఒక అరుదైన రికార్డ్ క్రియేట్ చేసింది. నిజ జీవితంలో మాత్రం న్యూఢిల్లీకి చెందిన ఈ భామ 2021 నవంబర్‌లో రాహుల్ (Rahul Sharma Navy Officer) అనే నేవీ ఆఫీసర్‌ను వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా కెరీర్‌ను కొనసాగిస్తూ, హిందీ బుల్లితెరపై వరుస అవకాశాలు అందుకుంటోంది. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉండే శ్రద్ధా ఆర్య ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Comments